తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు,..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225 వరకు పెంచాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పర్యావర నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులైన యూనియన్
ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేయాలని కోరింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జమ్మూ, కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేసిన WP(C) 237/2022తో ఈ WPని ట్యాగ్ చేయవచ్చని కూడా ఆదేశించింది. జమ్మూ – కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 లో పొందుపరిచిన విధంగా జమ్మూ-కశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుంచి 90 వరకు పెంచేందుకు 2020లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వును జతచేస్తూ ఓయూ రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Source - tv9

No comments:
Post a Comment