గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..
కరోనా వైరస్ నేపధ్యంలో ప్రస్తుతం విద్యార్ధులందరూ విద్యను ఆన్‌లైన్ ద్వారానే అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద విద్యార్ధులపై ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను అందించనున్నారు. సొసైటీ పరిధిలో 60 వేల మంది విద్యార్ధులు చదువుతుండగా.. వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో మిగిలిన విద్యార్ధులకు ఆన్‌లైన్ విద్యలో ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే విశాఖపట్నంలో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరిశుభ్రత, పచ్చదనం మైంటైన్ చేస్తూ.. తొలిస్థానంలో నిలిచే గురుకులానికి రూ. 50 వేలు, రెండో స్థానంలో నిలిచిన గురుకులానికి రూ. 30 వేలు ప్రోత్యాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.
Source -- tv9
ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. హైకోర్టుకు తాళం
కరోనా న్యాయమూర్తులనూ వదలి పెట్ట లేదు. ఈ ప్రభావంతో ఇంటి నుంచే కేసుల విచారణపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఆన్‌లైన్ విచారణలకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. మద్రాసు హైకోర్టు చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటా ఈ హైకోర్టుకు ఒక్క రోజు మాత్రం తాళం వేస్తారు. ఇందుకు ఈ హైకోర్టు స్థలాన్ని అప్పగించిన యజమాని గతంలో విధించిన షరతులే కారణం. ఆ తదుపరి వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక బెంచ్‌లు, అత్యవసర కాలంలో ప్రత్యేక బెంచ్‌లు అంటూ విచారణలు సాగిస్తూనే వస్తున్నారు.
లాక్‌డౌన్ పుణ్యమా కోర్టు సేవల్ని నిలుపుదల చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈనెల ఒకటో తేదీ నుంచి మళ్లీ కోర్టుల్లో విచారణలు మొదలయ్యాయి. మద్రాసు హైకోర్టుతో పాటు మదురై ధర్మాసనంలోనూ విచారణలకు శ్రీకారం చుట్టారు. అయితే, న్యాయమూర్తులు, సిబ్బంది కోర్టుకు హాజరైనా, న్యాయవాదులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. న్యాయవాదులు ఆన్‌లైన్ ద్వారా వాదనల్ని వినిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. 33 బెంచ్‌ల ద్వారా కేసుల విచారణలకు శ్రీకారం చుట్టారు. అయితే, ప్రస్తుతం కరోనా న్యాయమూర్తులను వదలి పెట్ట లేదు. ముగ్గురు న్యాయమూర్తులు కరోనా బారిన పడి ఉండడం వెలుగు చూసింది.
ముగ్గురు న్యాయమూర్తులు, పలువురు సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం, మరికొందరు న్యాయ మూర్తులకు పరిశోధన నివేదికలు రావాల్సి ఉండడం వెరసి హైకోర్టును మూసి వేయాల్సిన పరిస్థితి. హైకోర్టు న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానంతరం హైకోర్టుకు తాళం వేయడానికి నిర్ణయించారు. హైకోర్టుకు న్యాయవాదులు, సిబ్బంది ఇక రావద్దు అని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌లకు నియ మించిన న్యాయమూర్తులు వారి వారి ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టనున్నారు
ఇందు కోసం ప్రత్యేకంగా న్యాయమూర్తులు వినిత్ కొతారి, సురేష్ కుమార్ నేతృత్వంలో ఓ బెంచ్, న్యాయమూర్తులు శివజ్ఞా నం, పుష్పా సత్యనారాయణల నేతృత్వంలో మరో బెంచ్ ఏర్పాటు చేశారు. మరో నాలుగు సింగిల్ బెంచ్‌లను ఏర్పా టుచేశారు. వీటికి నలుగురు న్యాయమూర్తులను నియమించారు. కింది కోర్టుల్లోనూ అన్ని విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు. అత్యవసర కేసుల్ని మాత్రం ఇక, విచారించేందుకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి.
Source-Sakshi
అమ్మ బతకాలని..

పేద తల్లిని కబళిస్తున్న కిడ్నీ వ్యాధి
పూట గడవని కుటుంబం
తల్లి కోసం చదువు మానేసిన కొడుకు
దాతల సాయానికి ఎదురు చూపులు
అమ్మ చేతి ముద్దలు తినాల్సిన ప్రాయం.. ఆ ఇద్దరు పిల్లలది. ఇప్పుడు అమ్మకి అన్నీ తామే అయ్యారు. చావుకు దగ్గరవుతున్న ఆమెను బతికించుకునేందుకు వారు పడుతున్న ఆరాటం చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. తమ చదువును కూడా పక్కన పెట్టి తల్లి సేవకు అంకితమైన ఆ పిల్లలు దాతలు స్పందించాలని ప్రాధేయపడుతున్నారు.
కొత్తవలస (శృంగవరపుకోట): ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన ఆలపాటి వెంకట సుబ్బారావు పొట్టకూటికి విశాఖపట్నం వలస వచ్చి ఊరూరా తిరుగుతూ అగరొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అరకుకు చెందిన వెంకటపద్మను 2004లో వివాహం చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసలో స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2018లో వెంకటపద్మ రెండు కిడ్నీలు పాడైపోవటంతో సుబ్బారావు తనకున్న దాంట్లో మూడేళ్లుగా వైద్యం చేయిస్తూ అప్పుల పాలైపోయాడు. వ్యాపారం నడవక.. వయసు మీరటంతో పూట గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఆమెకు మెరుగైన వైద్యం చేయించలేక సతమతమవుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఇచ్చే రూ.10 వేల పింఛన్ ప్రస్తు తం వారిని ఆదుకుంటున్నా.. మందులకో సం దాతలపై ఆధారపడాల్సి వస్తోంది.
బడికి దూరమైన పిల్లలు
తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆమెకు సేవలందించేందుకు వారికి ఉన్న ఇద్దరు పిల్లలు మూడేళ్లుగా బడికి దూరమయ్యారు. పరిస్థితి తెలుసుకున్న జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులను ఒప్పించి పెద్ద కొడుకు భరత్‌కుమార్‌కు పుస్తకాలు కొనిచ్చి చదివిస్తుండగా ప్రస్తుతం 9 తరగతికి వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఇచ్చే కూర, రసంతో కాలం గడుపుతున్నారు. చిన్నకొడుకు వంశీ మాత్రం మూడోతరగతితో చదువు మానేసి తల్లి ఆలనా పాలనా చూస్తున్నాడు.

నా పిల్లలు ఏమవుతారో..
నా రెండు కిడ్నీలు పోయాయి. నెలకు 12 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. చదువుకొని ఆడుకోéల్సిన నా ఇద్దరు పిల్లల్లో ఒకరు స్కూల్ మానేసి నాకు సేవలు అందిస్తున్నాడు. పెద్దకొడుకు ఇంటిపనులు చేస్తున్నాడు. నాపిల్లలు ఏమవుతారో తెలియడం లేదు. – ఆలపాటి వెంకట పద్మ

వంట చేసి స్కూల్‌కెళ్తా..
ఉపాధ్యాయులు ఇచ్చిన ధైర్యంతో పాఠశాలకు వెళుతున్నాను. మా అమ్మ పరిస్థితి చూసి కొంత ఆర్థిక సాయం చేశారు. స్కూల్‌కు వెళ్లేముందు బొగ్గుల కుంపటిపై అన్నం వండి తమ్ముడికి అప్పగించి వెళ్తున్నా..
– భరత్‌కుమార్, పెద్ద కుమారుడు

అందుకే బడికెళ్లడం మానేశా..
అమ్మకు రెండు కిడ్నీలు పోవటంతో ఏం చేయాలో తెలియడం లేదు. తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. అమ్మకి సేవలు చేసేందుకు మాకు ఎవరూ లేరు. అందుకే నేను బడికి వెళ్లటం మానేశాను.
– వంశీ, చిన్న కుమారుడు
అమ్మకు రెండు కిడ్నీలు పోవటంతో ఏం చేయాలో తెలియడం లేదు. తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. అమ్మకి సేవలు చేసేందుకు మాకు ఎవరూ లేరు. అందుకే నేను బడికి వెళ్లటం మానేశాను.
– వంశీ, చిన్న కుమారుడు
నైతిక విలువలున్న కుటుంబం
కన్నతల్లికి రెండు కిడ్నీలు పాడవటంతో చూసుకోవడానికి రెండో కొడుకు పాఠశాలకు రావటం మానేశాడు. విషయం తెలుసుకుని తోటి ఉపాధ్యాయులంతా కొంత మొత్తం వేసుకుని కుటుంబానికి సాయం చేశాం. నైతిక విలువలున్న కుటుంబం వారిది.
– కృష్ణవేణి, విశ్రాంత ఉపాధ్యాయిని

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్
స్పందించే దాతలు 90529 81811 ఫోన్‌నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని
స్పందించే దాతలు 90529 81811 ఫోన్‌నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని
Source -Sakshi e paper
మహిళలకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు..!
రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే వారికి YSR సున్నా వడ్డీ పథకంతో ప్రభుత్వం చేయూత ఇస్తుండగా.. తాజాగా బ్యాంక్ వడ్డీరేట్లపై ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ఏటా రూ.283కోట్ల లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రభుత్వంపై రూ.150.14 కోట్ల వడ్డీ భారం తగ్గనుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పొదుపు సంఘాలు బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో.. చెల్లింపు విషయంలో మహిళలకు భారంగా మారిందని ఆయన అన్నారు. దీనిపై దృష్టి సారించిన సీఎం, బ్యాంకర్లతో చర్చించినట్లు పెద్దిరెడ్డి వివరించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు సంఘాల రుణాలపై 12.50 శాతం వడ్డీరేటు వసూలు చేయగా.. ప్రస్తుతం 9.25 శాతానికి తగ్గిందని మంత్రి అన్నారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 12.50శాతం ఉండగా.. ప్రస్తుతం 8.10 నుంచి 9.60శాతం వసూలు చేయనుందని వివరించారు. అలాగే ఆప్కాబ్ కూడా 12.50 శాతం నుంచి 10శాతానికి.. సిండికేట్ బ్యాంక్ తో విలీనమైన కెనరా బ్యాంక్ 9.15 నుంచి 9.40 వరకు వడ్డీ రేట్లను తగ్గించినట్లు మంత్రి పేర్కొన్నారు
SOURCE - TV9
Subscribe to:
Posts (Atom)
జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. 2వ రోజు అప్‌డేట్స్
►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చ...
-
►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చ...
-
ఏపీ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. గాజువాక...