జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. 2వ రోజు అప్‌డేట్స్‌


►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె వెంకటరమణ

ఏలూరు జిల్లా:
►కైకలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ  జయమంగళం వెంకటరమణ

ఎన్టీఆర్ జిల్లా :
►తిరువూరు పట్టణంలోని ఒకటో వార్డులో "జగనన్నే మా భవిష్యత్తు- నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమంలో గృహసారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి

తిరుపతి జిల్లా:
►"జగన్ అన్నే మా భవిష్యత్తు" కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమం పథకాలను వివరిస్తూ, తలుపులకు, ఫోన్ లకు జగనన్న స్టిక్కర్ లను అతికించి, సర్వే నిర్వహించిన స్ధానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పార్టీ శ్రేణులు, వాలంటీర్లు గృహసారథులు, సచివాలయం కన్వీనర్లు

తిరుపతి జిల్లా:
►కొర్లగుంట మారుతీ నగర్ లో కొనసాగుతున్న ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
►ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పై లబ్ధి దారులనుంచి వివరాలు సేకరిస్తు  ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్న ఎమ్మెల్యే భూమన

మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ లను ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం లబ్ధి దారులు సంతోషంగా అతికిస్తున్నారు

ఎన్టీఆర్ జిల్లా:
చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు

నెల్లూరు జిల్లా: 
ఇందుకూరుపేట (మం)  కొత్తూరులో  జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి..
 
 

►ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రెండో రోజు ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.

►దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్‌ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు.

►గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 14 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించాయి.


తొలి రోజు ఘనమైన ఆహ్వానం
 ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్త­కంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్క­చెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్‌ ఫోన్‌కు వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్‌.. అంటూ నినాదాలు.. ఇదీ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి  తొలి రోజున వచ్చిన స్పందన.

ప్రతి ఇంటా ఎదురేగి ఆహ్వానం 
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వాని న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్‌ జగన్‌ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్‌ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్‌ జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్‌ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్‌’ అంటూ నినదించారు.

జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..?

 టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారో చర్చిద్దామా? అని ప్రశ్నించారు. 1.50 కోట్ల ఇళ్ల దగ్గరకు రావడానికి చంద్రబాబు సిద్దమా? అని మంత్రి సవాల్‌ చేశారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః

బాబు పిల్ల చేష్టలుః
నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల మీద చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్స్ చూస్తే.. పిల్ల చేష్టల్లా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిది. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి.  74 ఏళ్ళ వయసు, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగటం- దాన్ని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది.  మీ హయంలో పునాది దశకే పరిమితమైన టిడ్కో ఇళ్లను మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి, మౌలిక సదుపాయలు కల్పిస్తే.. దాన్ని నీవేదో ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఎక్కడ లేదు అని అడుగుతున్నాం. 

టిడ్కో ఇళ్ళు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పు భారం వేస్తే.. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆ భారాన్ని మొత్తం తగ్గించి పేదవాళ్ల కు వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు.

బాబుకు ఛాలెంజ్ః
చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చేసిన ట్వీట్ కు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 50 లక్షల గడపల దగ్గరకు రావడానికి, ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో చర్చించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.  అలానే, మా హయాంలో నిర్మిస్తున్న 17, 005 జగనన్న కాలనీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ కాలనీలలో లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఏ విధంగా కాలనీల్లో ప్రజలు నివాసం ఉంటున్నారో తెలుసుకోవడానికి మాతో పాటు చంద్రబాబు వచ్చినా సరే, లేకుంటే ఆయనతో పాటు మేము అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నా. స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?. మీ అబ్బాయి నారా లోకేష్ కు పనిపాట లేక రోడ్ల వెంట తిరుగుతున్నాడు. బస్సు ఎక్కి ఫోటో, ఆటో దగ్గర ఫోటో దిగి పెడుతున్నాడు. మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గులేదా? అని అడుగుతున్నాం.

అదానీ రుణాలపై సెబీ కన్ను, ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్లకు మరో 51 వేల కోట్ల షాక్‌

అదానీ గ్రూపులో అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌  హిండెన్‌బర​్‌ రేపిన మరింత ముదురు తోంది.  వికీపీడియా సంస్థ ఆరోపణల దుమారానికి తోడు తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్రెడిట్ రేటింగ్ సంస్థల నుండి అదానీ గ్రూప్ కంపెనీల స్థానిక రుణాలు, సెక్యూరిటీల అన్ని రేటింగ్‌ల వివరాలను కోరినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది.

సెబీ అదానీ సంస్థల రుణాల రేటింగ్‌లపై సమాచారాన్ని కోరిందంటూ ఎకనామిక్ టైమ్స్ నివేదించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. తీవ్ర అమ్మకాలతో ఇన్వెస్టర్లు ఏకంగా  రూ. 51,000 కోట్లు నష్టపోయారు. బుధవారం  నాటి నష్టాల మార్కెట్‌లో  అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 9.55 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్ షేరు 4.66 శాతం కుప్పకూలాయి.  ఇంకా అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు ఒక్కొక్కటి 5 శాతం పడిపోయాయి. గత రెండు వారాల్లో అత్యంత దారుణ పతనాన్ని బుధవారం చవిచూశాయి. అదానీ గ్రూప్ సంస్థలు మ్యూచువల్ ఫండ్స్‌కు ముందస్తు చెల్లింపులు చేస్తున్నప్పటికీ స్టాక్ పతనం కొనసాగుతోంది.

గత రెండు రోజులుగా, కమర్షియల్ పేపర్‌లకు సంబంధించిన ఫిబ్రవరి బకాయిల కోసం SBI MF, HDFC MF & ABSL MFలకు ముందస్తు చెల్లింపులు జరిగాయి.  అలాగే మార్చి బకాయిలకు ముందస్తు చెల్లింపును కూడా ప్రకటించింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్ హోల్డర్‌లకు కొన్ని వారాల్లో రుణ రీఫైనాన్సింగ్ ప్లాన్‌లను ప్రకటిస్తామని కూడా అదానీ  ప్రకటించింది. పలు అదానీ కంపెనీల స్టాక్ ధరలు భారీగా పతనంతో  లిక్విడిటీ పొజిషన్లు, రుణాలు తీసుకున్న కంపెనీల రుణ చెల్లింపు సామర్థ్యంపై ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా అని నిర్ధారించడానికి సెబీ బహుశా ప్రయత్నిస్తోందట.

కాగా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు అదానీ గ్రూపు తత్రీవంగా ఖండించినప్పటికీ ఈ వివాదం ఇంకా సమసి పోక ముందే వికిపీడియా ఎంట్రీలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని వికిపీడియా స్వతంత్ర వార్తాపత్రిక సైన్ పోస్ట్ ఆరోపించింది.పెయిడ్ ఎడిటర్లను పెట్టి తమ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని  వాదించిన సంగతి తెలిసిందే.

Credits:-sakshi news

పవన్ కల్యాణ్ దృష్టిలో 4 నియోజకవర్గాలు?

 ఏపీ అసెంబ్లీకి 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. గాజువాక‌తోపాటు ప‌శ్చిమ‌గోదావ‌రిలోని భీమ‌వ‌రం నుంచి పోటీచేసిన‌ప్ప‌టికీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీప‌డ్డ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను తెలుగుదేశం పార్టీ మూడోస్థానానికి ప‌డిపోయింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌ని కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ నియోజకవర్గం నుంచైతే సులవుగా గెలుపు గుర్రం ఎక్కవచ్చంటూ ఒక ప్రయివేటు సంస్థచేత సర్వే నిర్వహింప చేయించారు.

తిరుపతి, పిఠాపురం అత్యంత సేఫ్!


సర్వే నిర్వహించిన సంస్థ నాలుగు నియోజకవర్గాలను సూచించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం అయితే ప‌వ‌న్ కల్యాణ్ సులువుగా గెలుపు గుర్రం ఎక్కేస్తారంటూ ఇక్క‌డి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా గతంలో ప‌లుమార్లు ఆహ్వానం పంపించారు. ఇప్పుడు సర్వేలో కూడా ఈ నియోజకవర్గం పేరు ఉంది. సంస్థ సూచించిన మరో నియోజకవర్గం చిత్తూరు జిల్లా తిరుపతి. గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారుకానీ సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తిరుపతి పట్టణంలో సామాజికవర్గ దన్నుతోపాటు అభిమానుల బలం ఎక్కువ‌. దీంతో తిరుప‌తి లేదంటే పిఠాపురం అయితే పవన్ కు బాగుంటుందంటూ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది.

Ilanti youtube channels meda action teskora..


నా జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లలేదు: చిత్తూరు స‌బ్ జైలులో చంద్ర‌బాబు!

 కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్‌ నేర చరత్రపై పోరాటం చేస్తామ‌ని, చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న కుప్పం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌న్ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు.


నా జీవితంలో ఏనాడూ జైలుకెళ్లి పరామర్శించలేదు

త‌న రాజ‌కీయ జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లి ప‌రామ‌ర్శించిన దాఖ‌లాలు లేవ‌ని, ఈరోజు జైలులో ఎనిమిది మంది కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించానన్నారు. కుప్పంలో అన్న‌క్యాంటిన్‌ను అడ్డుకోవ‌డ‌మే కాకుండా త‌మ నాయ‌కుల‌పైనే కేసులు పెట్టార‌ని, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని కూడా త‌రిమికొట్టే రోజు వ‌స్తుంద‌న్నారు. కొంద‌రు పోలీసులు త‌మ విధి నిర్వ‌హ‌ణ మ‌రిచిపోయార‌ని, వారికి బాధ్య‌త‌ను గుర్తుచేస్తామ‌న్నారు. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాద‌ని పులివెందుల్లో కూడా గెల‌వ‌బోతున్నామ‌ని స‌వాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్ అమ‌రావ‌తి, పోల‌వ‌రం పై అన్నీ అబద్దాలే చెబుతున్నార‌ని చంద్రబాబు మండిప‌డ్డారు.


Pegasus ..

 


జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. 2వ రోజు అప్‌డేట్స్‌

►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చ...